నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఓపెన్..

నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఓపెన్..

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 65వేల800 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతోంది. 76వేల 901 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్లు 5 అడుగుల మేరకు పైకి ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది..ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్ల 312.0450 టీంఎసీలు. అంటే పూర్తిస్థాయిలో డ్యాం నిండిపోయింది. ఇద గత 18 ఏళ్లలో ఇలా జూలై /ఆగస్టు నెలలో పూర్తి స్థాయి నీటితో నిండడం అరుదైన విషయం. భారీ వరదల కారణంగా వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 

ALSO READ : హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించం..

ఈ నీటి నిల్వతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో దాదాపు 2వేల226 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు, విద్యుత్ ఉత్పాదన, తాగునీటి సరఫరాకు వినియోగిస్తారు. ఇక విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది..ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. జల విద్యుత్ కేంద్రం నుంచి 815.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది