Coolie First Review: అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోన్న‘కూలీ’.. క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ఇదే

Coolie First Review: అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోన్న‘కూలీ’.. క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ఇదే

ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు (Umair Sandhu)గురించి అందరికీ తెలిసిందే. ఇపుడు ఆయన  రజినీకాంత్ నటించిన ‘కూలీ’ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ X వేదికగా పోస్ట్ చేశాడు. ఈ రివ్యూలో సినిమాకు సంబంధించిన పాజిటివ్ & నెగిటివ్ అంశాలను చెప్పుకొచ్చాడు. మరీ కాంట్రవర్సల్ క్రిటిక్ ఇచ్చిన రివ్యూ ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం..

అడ్వాన్స్ బుకింగ్స్:

సూపర్ స్టార్ రజినీకాంత్-అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. గురువారం (ఆగస్టు 14న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో ప్రస్తుతం కూలీ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు, కూలీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.51 కోట్లకు పైగా ప్రీ-సేల్స్‌ను నమోదు చేసింది. ఇందులో దాదాపు రూ.14 కోట్ల గ్రాస్ దేశీయ మార్కెట్ నుండే వచ్చినట్లు ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత, ప్రీ-సేల్స్ వ్యాపారం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవరాల్ గా 'కూలీ' ఫస్ట్ డే ప్రీ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందనే టాక్.  ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే రివ్యూ ఇవ్వడానికి వచ్చాడు క్రిటిక్ ఉమైర్ సంధు.

కూలీ ఫస్ట్ రివ్యూ:

‘కూలీ ఫస్ట్ రివ్యూ: రజనీకాంత్ కమ్ బ్యాక్ ఇచ్చారు. తన వన్ మ్యాన్ షోతో సినిమాను రక్తికట్టించారు. అన్ని రకాలుగా షో మొత్తాన్ని దోచేశారు. పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇతర స్టార్ క్యాస్ట్స్ సైతం తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. అయితే, లోకేష్ కనగరాజ్ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్‌గా ఉంది. క్లైమాక్స్, చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను నిలబెట్టింది. నాగార్జున విలన్ రోల్లో ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఇది ఆడియన్స్ చూసేందుకు అతిపెద్ద హైలెట్‌గా నిలిచిందని’ఉమైర్ సంధు తనదైన శైలిలో కూలీ రివ్యూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా చివర్లో 5కి 3.5 రేటింగ్ ఇచ్చి రివ్యూ ముగించాడు. 

ప్రస్తుతం ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటికీ మొన్న ఉమైర్ సంధు తనదైన శైలిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు రివ్యూ ఇచ్చి వార్తల్లో ఎక్కాడు. గేమ్ ఛేంజర్ కు ఇచ్చిన పూర్తి నెగిటివ్ రివ్యూతో.. మెగా ఫ్యాన్స్ అతనిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. 

‘కూలీ’ సినిమాకు సెన్సార్ బోర్డు Aసర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా ఏకంగా 2 గంటల 50 నిమిషాల పాటు వస్తుండటం ఇంట్రెస్ట్ పెంచుతోంది. (ఇందులో 'కార్డ్ యొక్క యానిమేటెడ్ విజువల్స్ RAJNI50ఇయర్స్' కూడా ఉంది) సర్టిఫికేషన్ ప్రకారం ఇది 25 సెకన్ల క్లిప్.

ఇందులో రజనీకాంత్ దేవాగా, సైమన్గా నాగార్జున, రాజశేఖర్గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ దహా పాత్రలో మెప్పించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై 'కూలీ' చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు.

ఇక ఇదే ఆగస్టు 14 రోజున.. ఎన్టీఆర్, హృతిక్ నటిస్తున్న వార్ 2 సైతం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల కోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి యుద్ధం జరగనుందో చూడాలి.