కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎస్ఆర్ కింద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ, అవియోనిక్స్ డివిజన్ రూ.2.3కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోని అత్యాధునిక పరికరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు కె.మహేశ్, రమేశ్‌బాబు, ఆర్ఎంవో డాక్టర్ నవీనా, డిప్యూటీ సూపరిండెంట్ ఉదయ్ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, వెలుగు: మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే వాటిని నియంత్రించవచ్చని కలెక్టర్పమేలా సత్పతి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం తిమ్మాపూర్ మండలంలోని జిల్లా రవాణాశాఖ ఆఫీస్‌లో జరిగిన ప్రోగ్రాం ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ 20వేల మందికి పైగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాన్నారు.
వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఈఈ నర్సింహచారి, డీఈ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
