
రాష్ట్రం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం డోమ్ లు కూల్చేస్తామంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దూమారం రేపుతున్నాయి. ఈ వివాధంపై ఇవాళ కరీంనగర్ 49వ డివిజన్ కార్పోరేటర్ కమల్జిత్ కౌర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని, విద్యార్థులు, యువతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.