ప్రైవేట్ స్కూళ్లు.. అనధికార ప్రచారం చేయొద్దు : కరీంనగర్ ఇన్ చార్జ్ డీఈవో ప్రశాంత్ రెడ్డి

ప్రైవేట్ స్కూళ్లు.. అనధికార ప్రచారం చేయొద్దు : కరీంనగర్ ఇన్ చార్జ్ డీఈవో ప్రశాంత్ రెడ్డి
  •     స్కూల్ బిల్డింగ్స్, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తీసేయాలి
  •     లేదంటే రూ.10 వేలు ఫైన్ 
  •     డీఈవో ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అనుమతి లేకుండా భవనాలు, ప్రహరీ గోడలు, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌‌‌‌‌‌‌లు, బ్యానర్లను వెంటనే తొలగించాలని కరీంనగర్ ఇన్ చార్జ్ డీఈవో ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు పెట్టింది చదువు చెప్పేందుకేనని, వ్యాపారం కోసం కాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలు నిర్వహించాలని ఎంఈఓలను ఆదేశించారు. 

సర్క్యులర్ అందిన మూడు రోజుల్లో అనధికారిక ప్రకటనలు  తొలగించకపోతే ఆయా యాజమాన్యాలపై రూ.10 వేలు ఫైన్ తోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డీఈవో ఈ తరహా ఉత్తర్వులు జారీ చేయడం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల్లో చర్చనీయాంశంగా మారింది.