ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో ఈనెల 30 నుంచి అక్టోబర్2 వరకు నిర్వహించనున్న కళోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ స్టేడియంలో గురువారం రాత్రి క్యాంప్ ఫైర్ ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ కాగడాతో క్యాంప్​ ఫైర్​ను ప్రారంభించారు.  ఇజ్రాయిల్, మలేషియా, అండమాన్ నికోబార్ దేశాలతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు క్యాంప్ ఫైర్ లో  జానపద గేయాలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. అనంతరం 5మినిట్ క్రాకర్స్ షో జరిగింది.  కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్​ స్వరూపరాణి, కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.

గరుడ వాహనంపై అమ్మవారు

కరీంనగర్​రూరల్​, వెలుగు: కరీంనగర్‌‌మండలం నగునూర్‌‌లోని శ్రీదుర్గాభవాని ఆలయంలో గురువారం అమ్మవారు వైష్ణవి అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరీంనగర్​ ఫస్ట్​ అడిషనల్​ జిల్లా జడ్జి భవానీ చంద్ర అమ్మవారిని దర్శించుకున్నారు.  పూజల్లో ఆలయ ఫౌండర్‌‌, చైర్మన్​ వంగల లక్ష్మణ్, కార్పొరేటర్​ వంగల శ్రీదేవి, ఆలయ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. 

ఢిల్లీ పార్టీలు విషం చిమ్మాలని చూస్తున్నయ్

సీఎంగా కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి 

మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: ఢిల్లీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణలో విషం చిమ్మాలని చూస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం స్థానిక టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో లైబ్రరీ చైర్మన్ గా అనిల్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.  చీఫ్​గెస్ట్​గా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు కొనసాగుతూ, రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలంటే  సీఎంగా కేసీఆరే కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ 
చేతులను బలోపేతం చేద్దామని...ఆగే బడో హమ్ సాత్ హై అంటూ పిలుపునిచ్చారు. త్వరలో రూ.7.5కోట్లతో లైబ్రరీ బిల్డింగ్ పూర్తి చేసి,రూ.2.5కోట్ల వ్యయంతో లైబ్రరీని డిజిటలైజేషన్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం అనిల్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు చేరువయ్యేలా లైబ్రరీని తీర్చిదిద్దుతామన్నారు. 

రూ.2కోట్ల దోబీఘాట్ కు భూమిపూజ

34వ డివిజన్ గోదాంగడ్డలో రూ.2కోట్లతో నిర్మించే మోడ్రన్ దోబీఘాట్ పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులకు ఉపయోగపడేలా మోడ్రన్ దోబీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం  అంబేద్కర్ స్టేడియంలో  కొనసాగుతున్న కరీంనగర్ కళోత్సవ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, అడిషనల్ కలెక్టర్ గరిమ‍అగర్వాల్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‍ రావు, మాజీ ఎమ్మెల్యే  సత్యనారాయణ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
మాజీ ఎంపీ వివేక్

జగిత్యాల, వెలుగు: బీజేపీని గడపగడపకు చేర్చే బాధ్యత యువతపై ఉందని, ఆ దిశగా కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి సూచించారు. బుగ్గారం మండలాధ్యక్షుడిగా మేడవేణి శ్రీధర్​నియామకమయ్యారు.  గురువారం బాధ్యతలు చేపట్టాక శ్రీధర్​ హైదరాబాద్​లో మాజీ ఎంపీ వివేక్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఇకనుంచి ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. శ్రీధర్ వెంట స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచి రాజేశ్, మందపల్లి శ్రీనివాస్, పాలెర్ల నరేశ్​ ఉన్నారు.

క్వాలిటీ లేని పనులు.. కూలుతున్న డ్రైన్లు

కరీంనగర్​బల్దియాలో  డ్రెయిన్ల నిర్మాణాల్లో నాణ్యత లేమి

ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన డ్రైన్లు 

అలుగునూరులో ముచ్చటగా మూడోసారి నిర్మాణం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల్లో క్వాలిటీ లేకపోవడంతో నిర్మించిన కొద్దిరోజులకే కూలుతున్నాయి. కరీంనగర్​కార్పొరేషన్​పరిధిలోని  అలుగునూరులో గతేడాది 14వ ఫైనాన్స్ కమిషన్ ​నిధుల నుంచి రూ.8 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. నాసిరకంగా నిర్మిస్తుండటంతో కొద్ది రోజులకే కూలిపోయింది.  మరోసారి డ్రెయిన్ 
నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మరోసారి కూలిపోయింది. బెడ్ పోయకుండా..  బేస్ లేకుండానే నిర్మాణం చేపట్టడంతోనే రెండు సార్లు కూలిపోయినట్లు తెలుస్తోంది.  నాసిరకం పనులపై బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

నగరానికి చెందిన  సోషల్ యాక్టివిస్ట్ అమీర్  కార్పొరేషన్​లో జరుగుతున్న నాసిరకం పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో  ముచ్చటగా మూడోసారి  డ్రెయిన్ నిర్మిస్తున్నారు. ఈ సారి కింద బెడ్ తో  పాటు.. డ్రెయిన్ పునాది కూడా సరిగా నిర్మిస్తేనే వరదకు తట్టుకుంటుందని కాలనీవాసులు చెబుతున్నారు. అల్కాపురి కాలనీలోనూ పట్టణ ప్రగతి కింద  రూ. 2 కోట్లతో నిర్మించిన స్ట్రీమ్​ వాటర్ డ్రెయిన్లు నాసిరకంగా నిర్మించారు. రూ.కోట్లు పోసి నిర్మిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే కూలిపోవడం.. ఆ వెంటనే మళ్లీ నిధులు కేటాయించి నిర్మాణాలు చేయడం పరిపాటిగా మారింది. నిర్మాణాలు జరుగుతున్నపుడే సరైన పర్యవేక్షణ చేసి ప్రజాధనం కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు. 

ధరణితో రైతులు సూసైడ్ ​చేసుకుంటున్నరు 

బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమా దేవి

కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‍ వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి ఆరోపించారు. గురువారం రేకుర్తిలో బీజేపీ కిసాన్‍ మోర్చా ఆద్వర్యంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమ్మేళనానికి చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ధరణి వల్ల ప్రజల భూములు ఇతరుల పేరుమీదకు మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ దిశను మార్చిందని, వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయన్నారు. మోడీ పాలనలో దేశానికి ప్రపంచంలో  ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.  ఆకలితో అలమటించే వారికి అన్నం పెడుతున్న ప్రధాని మోదీ ఫొటోను ఆ పథకాలపై ముద్రిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్‍ కిట్‍పై సీఎం కేసీఆర్‍ ఫొటోను ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు  గంగాడి  కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరామయ్య, కిసాన్ మోర్చా కార్యదర్శి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సొసైటీ లాభాల్లో రైతులకు వాటా

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సొసైటీ సభ్యులకు లాభాల్లో వాటా ఇస్తున్నట్లు కేడీసీసీబీ డైరెక్టర్ దేవరనేని మోహన్ రావు అన్నారు. చిన్నకల్వల పీఏసీఎస్​ జనరల్ బాడీ మీటింగ్ గురువారం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీ ఈ సంవత్సరం రూ.33.32 లక్షల ఆదాయం పొంది ఏ గ్రేడ్ సాధించిందన్నారు. సొసైటీలో రూ. 500 వాటాధనం కలిగిన రైతులకు లాభాల్లో ఆరు శాతం డివిడెంట్ రూపేణా వాటా పంచుతామన్నారు. మీటింగ్​లో సీఈవో వల్లంకొండ రమేశ్, సర్పంచ్ ఏరుకొండ రమేశ్, సహకార శాఖ మానిటరింగ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రాజు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

నిర్వాసితులకు రూ.25 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్​బాబు

వేములవాడ, వెలుగు : మిడ్​మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇండ్లు ఇచ్చిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బా
బు అన్నారు. గురువారం వేములవాడ అర్బన్​ మండలం సంకెపల్లిలో పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం సంకెపల్లి, అరెపల్లి గ్రామాల నిర్వాసితులకు రూ.25 కోట్ల విలువైన చెక్కులతోపాటు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య,  రాజన్న ఆలయ అభివృద్ధి,  కలికోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తికి కృషిచేస్తానన్నారు. త్వరలో మిగిలిన నిర్వాసితులకు పూర్తి పరిహారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ బాబు, వైస్​ఎంపీపీ ఆర్​సీ రావు, జడ్పీటీసీ రవి, ఆర్డీవోలు శ్రీనివాస్​ రావు, పవన్​ కుమార్​, తహసీల్దార్​ రాజు, సర్పంచ్ లు నవీన, సునిత, స్వయం ప్రభ, ఎంపీటీసీ లహరిక పాల్గొన్నారు.

డిజాస్టర్​ రెస్పాన్స్, ఫైర్​సేవలు అభినందనీయం

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

కరీంనగర్ సిటీ, వెలుగు: అగ్ని ప్రమాదాలను అరికట్టడం, వరదల సమయంలో ప్రజలను రక్షించడంలో  డిజాస్టర్​ రెస్పాన్స్, ఫైర్​డిపార్ట్​మెంట్ సిబ్బంది సేవలు అభినందనీయమని కరీంనగర్​కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ అన్నారు.  డిజాస్టర్​ రెస్పాన్స్, ఫైర్​డిపార్ట్​మెంట్​కు చెందిన అగ్నిమాపకులకు లోయర్ మానేర్ డ్యాంలో గురువారం నిర్వహిస్తున్న అడ్వాన్స్ ఫ్లడ్ రెస్క్యూ శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్​పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ డిజాస్టర్ రెస్పాన్స్ టీం పటిష్టంగా ఉందని, ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లా ఫైర్​ఆఫీసర్​టి.వెంకన్న, రాష్ట్ర  డిజాస్టర్​రెస్పాన్స్, ఫైర్​ ఆఫీసర్లు ఎస్.సందన్న, కేవీ కృష్ణకుమార్, పాల్గొన్నారు.

వరల్డ్ ​హార్ట్​డే..

కరీంనగర్‍ సిటీ, వెలుగు: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కరీంనగర్​లోని అపోలో రీచ్ హాస్పిటల్‍ ఆధ్వర్యంలో  గురువారం నిర్వహించిన 2కె రన్‍లో కలెక్టర్​ఆర్వీ కర్ణన్​పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్​మాట్లాడుతూ కరోనా టైంలో డాక్టర్లు, సిబ్బంది 24గంటలు సేవలందించి ప్రజల ప్రాణాలను కాపాడారని, వారి సేవలు మరువలేనవివన్నారు. కార్యక్రమంలో డా. ప్రమోద్ గుప్తా,  మెడికల్ సూపరింటెండెంట్ డా. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఆర్మీ లిక్కర్ సీజ్

జగిత్యాల, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన ఆర్మీ లిక్కర్ ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ జిల్లా ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. స్టేట్ ఆబ్కారీ శాఖ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఎక్సైజ్​ఆఫీసర్లు శ్రీధర్, చంద్రబోస్ ఆధ్వర్యంలో జగిత్యాల పురాణిపేట్ లోని వినాయక ట్రేడర్స్, కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్ లో రెండు టాస్క్ ఫోర్స్ టీంలు ఏకకాలంలో దాడులు చేసి కర్నాటకకు చెందిన ఆర్మీ లిక్కర్ 750 ఎంఎల్ 86, తెలంగాణకు చెందిన 750 ఎంఎల్ 4 బాటిల్స్ పట్టుకుని సీజ్ చేశారు. లిక్కర్ నిల్వ ఉంచిన ముక్క గంగాధర్, ప్రభాకర్ లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు తెలిపారు. మరోవైపు నిజంగా ఇది ఆర్మీ లిక్కరా లేక నకిలీ లిక్కరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ లిక్కర్ పై ఉన్న క్రేజ్ ను దసరా సందర్బంగా క్యాష్ చేసుకునేందుకే డంప్ చేశారని తెలుస్తోంది. 

ఫారెస్ట్ ​ఆఫీసర్లు సహకరించాలి

జడ్పీ చైర్ పర్సన్ అరుణ

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: ప్రజా అవసరాలకు, అభివృద్ధి పనులకు ఫారెస్ట్​భూములను వాడుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు సహకరించాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. గురువారం -కలెక్టరేట్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ హాజరై మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, గోడౌన్ లు.. తదితర నిర్మాణాలు చేపడుతోందన్నారు.

కలెక్టర్​మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం-2016 ప్రొసీజర్ ప్రకారం ప్రజావసరాలు, ప్రభుత్వ పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో అడిషనల్  కలెక్టర్ ఖిమ్యా నాయక్, ఆర్డీవోలు  శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, జిల్లా అటవీ అధికారి బాలమణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాం, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీలు కళావతి, లక్ష్మణరావు 
పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

వేములవాడ, వెలుగు: వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్​ చైర్​పర్సన్​ మాధవి పేర్కొన్నారు. గురువారం వేములవాడ 
మున్సిపల్ సమావేశం జరిగింది. సమావేశంలో 19 ఎజెండా అంశాలను కౌన్సిల్​సభ్యులు ఆమోదించారు.  ఈ సందర్భంగా  చైర్ పర్సన్ మాధవి మాట్లాడుతూ  వేములవాడ 
మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో స్వచ్ఛత అవార్డు రావడం సంతోషంగా ఉందని,  కౌన్సిల్​ సభ్యులు,  ప్రజల సహకారం వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు. 

అధికారులపై ఎమ్మెల్యే కల్వకుంట్ల ఫైర్​

మల్లాపూర్, వెలుగు:  మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, గ్రామాల్లో తరచూ నీటి సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఫైర్​ అయ్యారు. గురువారం ఎంపీడీవో ఆఫీస్​లో ఎంపీపీ సరోజన అధ్యక్షతన మండల జనరల్​బాడీ మీటింగ్​జరిగింది.  చీఫ్​గెస్ట్​గా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరయ్యారు. మీటింగ్​లో వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వైద్య శాఖ , మిషన్ భగీరథ ఆఫీసర్స్ తమ పనితీరు మార్చుకోవాలి లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

అంతకుముందు మల్లాపూర్​మండలం ముత్యంపేట్​గ్రామంలోని ప్యాక్స్ కొత్త గోదాం నిర్మాణం, మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని శ్రీ కనుక దుర్గా ఆలయానికి కాంపౌండ్​వాల్ , రేకుల షెడ్డు నిర్మాణాలకు రూ.4లక్షలు మంజూరుకాగా ప్రొసీడింగ్​పత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ నాగేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ శరత్,  ప్యాక్స్​ చైర్మన్లు , ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు పాల్గొన్నారు. 

కంబోడియా నుంచి కరీంనగర్​కు...

సురక్షితంగా చేరుకున్న సైబర్​స్కాం బాధితులు

కరీంనగర్ క్రైం, వెలుగు: గత నెలలో ఉపాధి కోసం కంబోడియా వెళ్లి చైనీస్ సైబర్ స్కాం ముఠా చేతిలో చిక్కుకున్న ఐదుగురు యువకులు సురక్షితంగా కరీంనగర్​కు చేరినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం నగరంలోని పోలీస్ హెడ్​ క్వార్టర్స్​లో మీడియాకు యువకులు షబాజ్ ఖాన్, షారూఖ్​ ఖాన్, సలీం అహ్మద్, హాజీబాబా, నవీద్ అబ్దుల్ ను చూపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కంబోడియాలో సైబర్ స్కాం ముఠా చేతిలో చిక్కుకున్న యువకులను కాపాడాలని కుటుంబ సభ్యులు ఈనెల 19న ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టి స్వదేశానికి తీసుకొచ్చామని సీపీ తెలిపారు. 

అధికారులపై ఎమ్మెల్యే కల్వకుంట్ల ఫైర్​

మల్లాపూర్, వెలుగు:  మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, గ్రామాల్లో తరచూ నీటి సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఫైర్​ అయ్యారు. గురువారం ఎంపీడీవో ఆఫీస్​లో ఎంపీపీ సరోజన అధ్యక్షతన మండల జనరల్​బాడీ మీటింగ్​జరిగింది.  చీఫ్​గెస్ట్​గా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరయ్యారు. మీటింగ్​లో వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా వైద్య శాఖ , మిషన్ భగీరథ ఆఫీసర్స్ తమ పనితీరు మార్చుకోవాలి లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. అంతకుముందు మల్లాపూర్​మండలం ముత్యంపేట్​గ్రామంలోని ప్యాక్స్ కొత్త గోదాం నిర్మాణం, మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని శ్రీ కనుక దుర్గా ఆలయానికి కాంపౌండ్​వాల్ , రేకుల షెడ్డు నిర్మాణాలకు రూ.4లక్షలు మంజూరుకాగా ప్రొసీడింగ్​పత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ నాగేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ శరత్,  ప్యాక్స్​ చైర్మన్లు , ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు పాల్గొన్నారు. 

ఎంపీ సంతోష్ కుమార్ కనిపిస్తలేడంటూ ఫిర్యాదు

బోయినిపల్లి, వెలుగు: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్​నాయకులు బోయినిపల్లి పోలీస్​స్టేషన్​లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ మెంబర్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ ప్రశ్నిస్తున్న వెన్నమనేని శ్రీనివాస్ రావు తో ఎంపీకి సంబంధాలున్నట్లు మీడియా ద్వారా తమకు తెలిసిందని, ఈక్రమంలో ఎంపీ కనిపించడం లేదన్నారు. ఎంపీ ఆచూకీ కనిపెట్టాలని కాంగ్రెస్​నాయకులు పోలీసులను కోరారు. కార్యక్రమంలో  పార్టీ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, లచ్చయ్య పాల్గొన్నారు.

బతుకమ్మ పాటలు.. దాండియా ఆటలు

కరీంనగర్ టౌన్, తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​ రామచంద్రాపురి కాలనీలో గురువారం బీజేపీ మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి  రుద్రమదేవి వేడుకల్లో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఆడి పాడారు. దాండియా డ్యాన్స్​ 
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.