కరీంనగర్ జిల్లాలో మైనార్టీ గురుకులాల ..ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు

కరీంనగర్ జిల్లాలో మైనార్టీ గురుకులాల ..ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల విద్యార్థులకు ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బైపాస్‌‌‌‌‌‌‌‌లోని మైనారిటీ గురుకుల బాయ్స్ స్కూల్, కాలేజీ 1లో ఈ పోటీలను డీఐఈవో గంగాధర్, మైనారిటీ గురుకులాల కోఆర్డినేటర్ విమల ప్రారంభించారు. కరీంనగర్ సీఈవో, గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ వీర్ల మహేశ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని తెలిపారు. క్రీడల వల్ల క్రమశిక్షణతోపాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమ్‌‌‌‌‌‌‌‌పాషా, ప్రిన్సిపాల్స్​సంపత్, చంద్రమోహన్, కుమారస్వామి, అకాడమిక్ కో ఆర్డినేటర్ మహమ్మద్ మీరాజ్, డిప్యూటీ వార్డెన్స్,  పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.