V6 News

మొదటి విడతలో పోటెత్తిన ఓటర్లు ఉమ్మడి జిల్లాలో భారీగా పోలింగ్‌‌

మొదటి విడతలో పోటెత్తిన ఓటర్లు ఉమ్మడి జిల్లాలో భారీగా పోలింగ్‌‌
  • కరీంనగర్ జిల్లాలో 81.42 శాతం, జగిత్యాలలో 77.67శాతం
  • రాజన్నసిరిసిల్ల 79.57శాతం, పెద్దపల్లి 82.27శాతం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో జరిగిన  గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేయడంతోపాటు పంచాయతీ ఎన్నికలు కావడంతో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది.  కరీంనగర్ జిల్లాలో 81.42 శాతం పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్ల ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశ ఎన్నికలు జరిగిన చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, రామడుగు మండలాల్లో మొత్తం 1,52,408 మంది ఓటర్లు ఉండగా 1,24,088 మంది(81.42శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 వీరిలో 78,266 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 64,580(82.51 శాతం) మంది ఓటేశారు. ఐదు మండలాల్లో కలిపి ఏడుగురు ట్రాన్స్ జెండర్స్ ఉండగా  నలుగురు ఓటేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, వేములవాడ అర్బన్, రుద్రంగి మండలాల్లో 1,11,148 మంది ఓటర్లు ఉండగా 88,442 మంది(79.57) ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపల్లి, మెట్‌‌‌‌పల్లి ఎన్నికలు జరగగా.. 2,18,194 మంది ఓటర్లకు గానూ 1,69,486 మంది(77.67శాతం)  ఓటేశారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్​, కమాన్​పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండలాల్లో  1,43,856 మంది ఓటర్లు ఉండగా, 1,18,346 మంది ఓటర్లు(82.27)  పోలింగ్‌‌లో పాల్గొన్నారు.