
కరీంనగర్ క్రైం,వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం కరీంనగర్ సిటీలో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్, ఇతర భారీ సరుకు రవాణా వాహనాలను అనుమతి లేదని చెప్పారు.
హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ పల్లె బస్టాండ్ వద్ద నుంచి ముంజంపల్లి, పోరండ్ల నుంచి తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రోడ్డుకు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుంటాయి.
నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో అంటే ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుంటాయి.
కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి మళ్లింపులు లేకుండా యథావిధిగా వెళ్తాయి.
జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు నుంచి మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా సిరిసిల్ల బైపాస్ నుంచి కరీంనగర్‌కు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో రేకుర్తి జంక్షన్ నుంచి యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు, మల్కాపూర్ వైపు మళ్లించి, వెలిచాల ఎక్స్ రోడ్డు నుంచి జగిత్యాల రోడ్డుకు చేరుకుంటాయి.