ఇంటోళ్లే ఓటేయలే!..కరీంనగర్ జిల్లా రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి పడిన ఒక్క ఓటు

ఇంటోళ్లే ఓటేయలే!..కరీంనగర్ జిల్లా రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి పడిన ఒక్క ఓటు
  • ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులున్నా ఓట్లేయని వైనం

చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం వెలువడింది. చొప్పదండి మండలం రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు పడడంతో ఆమెతో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. సర్పంచ్ జనరల్ స్థానానికి ఆరుగురు పోటీ పడగా.. మొత్తం 854 ఓట్లు పోలయ్యాయి. వీరిలో అభ్యర్థి కొత్తూరి రాజ్యలక్ష్మికి ఒక్కటే ఓటు పడింది. 

ఆమె ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వేయలేదని తెలిసింది. అయితే.. ఆమె ప్రచారం చేసుకోకుండా.. మరో అభ్యర్థికి మద్దతు తెలపడంతోనే ఓట్లు వేయలేదనే వాదన వినిపిస్తోంది. ఇంకో అభ్యర్థికి 5 ఓట్లు మాత్రమే పడ్డాయి.  ఇదే గ్రామ సర్పంచ్ బందారపు అజయ్ కుమార్ గౌడ్ 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.