తిమ్మాపూర్, వెలుగు: అలుగునూర్ లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కాకా మెమోరియల్ టీ-20 ఫేజ్–1 విన్నర్‌గా కరీంనగర్ జట్టు నిలిచింది.
శుక్రవారం కరీంనగర్-, రాజన్న సిరిసిల్ల జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్నిర్వహించగా.. రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్టాస్వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. టాస్ గెలిచిన కరీంనగర్ జట్టు మొదట బాటింగ్ కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఈ జట్టులో రిత్విక్ సూర్య 91 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజన్న సిరిసిల్ల జట్టు 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఇర్షాద్ పాషా 3 వికెట్లు హర్షద్, సార్థక్ రెండేసి వికెట్లు తీశారు. అత్యధిక పరుగులు చేసిన కరీంనగర్ బ్యాటర్ సూర్యకు హెచ్‌సీఏ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, అడ్‌హక్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌చంద్ జైన్, సీనియర్ మెంబర్ ధన్ రాజ్ జైన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు.
ఉమ్మడి జిల్లా జట్టు ఇదే..
రాష్ట్రస్థాయిలో ఆడనున్న కరీంనగర్ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ జనరల్సెక్రటరీ ఎన్. మురళీధర్ రావు ప్రకటించారు. రితిక్ సూర్య, అక్డం, తక్షిల్, విజ్ఞేశ్, నితిన్ రెడ్డి, రాజు, శ్రీకాంత్ రెడ్డి, రాహుల్, సాయికిరణ్, సాత్విక్, సార్థక్, అర్షద్, సాయిగణేశ్ ఎంపికయ్యారని చెప్పారు.
వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరో ఐదుగురు సభ్యులతో కలిపి మొత్తం18 మంది ఆడనున్నట్లు తెలిపారు. సంఘం అధ్యక్షుడు ఆగంరావు, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, ట్రెజరర్ శ్రవణ్, ఎగ్జిక్యూటివ్మెంబర్స్అజిత్, హరికృష్ణ, సాగర్తదితరులు పాల్గొన్నారు.
