V6 News

వరల్డ్ యోగా ట్రైనింగ్ ఎగ్జామ్ లో .. మెదక్​ జిల్లా వాసికి  మొదటి స్థానం 

వరల్డ్ యోగా ట్రైనింగ్ ఎగ్జామ్ లో .. మెదక్​ జిల్లా వాసికి  మొదటి స్థానం 

మెదక్ (చేగుంట), వెలుగు:  వరల్డ్ యోగా ట్రైనింగ్ ఎగ్జామ్ లో మెదక్ జిల్లా వాసి కర్ణం శ్రీదేవి ఫస్ట్ ప్లేస్​లో నిలిచారు.  గత నెల 30 నుంచి ఈనెల 13 వరకు ఆన్​లైన్​లో  యోగా ట్రైనర్లకు ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో ఇండియా, జాంబియా, ఉగాండా, బంగ్లాదేశ్, టాంజానియా, స్పెయిన్, వియత్నం, బెల్జియం, అమెరికా, నేపాల్ దేశాల నుంచి 109 మంది యోగా ట్రైనర్స్ ను సెలెక్ట్ చేసి ఎగ్జామ్ నిర్వహించారు.

శనివారం ఫలితాలు వెల్లడి కాగా మెదక్ జిల్లా చేగుంటకు చెందిన శ్రీదేవి 98 శాతం మార్కులు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ సాధించారు. తద్వారా వరల్డ్ లెవల్ లో ఫస్ట్ ప్లేస్  నిలిచినట్టు యోగ కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. శ్రీదేవి వరల్డ్ లెవల్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవడంపై మెదక్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భుజగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్యం, జాయింట్ సెక్రటరీ  సురేశ్​, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింలు హర్షం వ్యక్తం చేశారు.