ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ

ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ
  • కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నాలుగు రాష్ట్రాల వారికి తమ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదని ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి ఈ నెల 31 వరకు రాకపోకలు నిషేధించింది. కేరళలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ ఆ రాష్ట్రం నుంచి కూడా ఎవ్వరినీ అనుమతించమని తెలిపింది. కరోనా వ్యాప్తి నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేంద్రం ప్రకటించిన గైడ్ లైన్స్ తప్పకుండా పాటిస్తామని కర్ణాటక సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఇక రాష్ట్రంలో కంటైన్ మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలో ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రం పరిధిలోనే తిరిగే రైళ్లను నడిపిస్తామని యడ్యూరప్ప చెప్పారు. ఆదివారం మాత్రం రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ను అమలు చేస్తామన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని…క్వారంటైన్ ను బలోపేతం చేయనున్నట్లు ప్రకటించారు.