న్యూఇయర్‌ వేడుకలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం

న్యూఇయర్‌ వేడుకలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. డ్యాన్స్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ దృష్ట్యా డిసెంబర్‌ 30 నుంచి నాలుగు రోజులపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు వివరిస్తూ పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. వేడుకల సందర్భంగా షేక్ హాండ్..హగ్స్కు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేడుకల్లో పొల్యుషన్ కలిగించని టపాసులు మాత్రమే కాల్చాలని చెప్పింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు.