భారత్​ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ : బసనగౌడ పాటిల్

భారత్​ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ : బసనగౌడ పాటిల్

బెంగళూరు : జవహర్‌‌లాల్ నెహ్రూ భారత తొలి ప్రధాని కాదంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత్​కు మొదటి ప్రధాన మంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, నెహ్రూ కాదని అన్నారు. ‘‘నిరాహార దీక్షల వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదని బాబాసాహెబ్ ఒక పుస్తకంలో రాశారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తూ పోరాటం చేస్తే స్వాతంత్ర్యం ఎన్నటికీ వచ్చేది కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లకు కలిగించిన భయం వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చింది.

దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడే నేతాజీ దేశ తొలి ప్రధాని అయ్యారు. అప్పటికే సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉన్నాయి. భారత్​కు మొదటి  ప్రధాని నెహ్రూ కాదు అని చెప్పడానికి కారణం ఇదే” అని పేర్కొన్నారు. గిన ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత్​కు మొదటి ప్రధాన మంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, నెహ్రూ కాదని అన్నారు. ‘‘నిరాహార దీక్షల వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదని బాబాసాహెబ్ ఒక పుస్తకంలో రాశారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తూ పోరాటం చేస్తే స్వాతంత్ర్యం ఎన్నటికీ వచ్చేది కాదు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లకు కలిగించిన భయం వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడే నేతాజీ దేశ తొలి ప్రధాని అయ్యారు. అప్పటికే సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉన్నాయి. భారత్​కు మొదటి  ప్రధాని నెహ్రూ కాదు అని చెప్పడానికి కారణం ఇదే” అని పేర్కొన్నారు.