ATM లో రూ.100కు బదులు రూ.500 నోట్లు

ATM లో రూ.100కు బదులు రూ.500 నోట్లు

ఓ ATM లో వంద రూపాయలకు బదులుగా రూ.5వందల రూపాయలు వచ్చాయి. ఈ విషయం ఆ బ్యాంకు అధికారులకు తెలిసే సరికే..అప్పటికే దాదాపు రూ.1.7 లక్షలను  డ్రా చేశారు కస్టమర్లు. ఈ ఘటన కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది.

మడికేరి ప్రాంతంలోని కెనరా బ్యాంకు ATMలో వంద రూపాయలు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి రూ.5వందల రూపాయలు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది వ్యక్తులు డబ్బులు డ్రా చేసుకెళ్ళారు.కెనరా బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లే సమయానికి ముందే ATM నుంచి  లక్ష ఏడు వేల రూపాయలు  డ్రా అయ్యింది. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ATM నుంచి డబ్బులను డ్రా చేసిన వారిని CCTV ఫుటేజ్ తో గుర్తించిన బ్యాంకు సిబ్బంది…మనీని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగతా వారు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో…పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటగా బ్యాంకు పొరపాటని వారు వాదించినా…పోలీసులు సర్ధి చెప్పడంతో డబ్బులను తిరిగి ఇచ్చేశారు.

నగదును ATM లో ఉంచే సంస్థ రూ. 100 నోట్లను ఉంచాల్సిన బాక్సులో రూ. 500 నోట్లను పెట్టింది. దీంతో వంద రూపాయలకు బదులుగా రూ.5వందల నోట్లు వచ్చాయి.