ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తి లాక్ డౌన్

ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తి లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో పలు దేశాలు ఇప్పటికే  లాక్ డౌన్ విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ,వీకెండ్ లాక్ డౌన్ ఉంది. కానీ వీటితో ఫలితం లేదనుకున్న కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నాయి. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కర్ణాటక చేరింది.  మే 10 ఉదయం 6 గంటల నుంచి మే 24ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర సీఎం యాడ్యురప్ప. కరోనా కర్ఫ్యూ వల్ల ఫలితం లేనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.వలస కార్మికులు ఎక్కడికి వెళ్లిపోవద్దన్నారు. అన్ని హోటళ్ళు, పబ్బులు, బార్‌లు మూసివేయబడతాయన్నారు. తినుబండారాలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే తెరిచి ఉంటాయన్నారు.