V6 News

అది రాజకీయం కాదు.. వ్యక్తిగతం : డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌

అది రాజకీయం కాదు.. వ్యక్తిగతం : డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌
  • ఎమ్మెల్యేలతో డిన్నర్‌‌‌‌ మీట్‌‌పై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌ వివరణ

బెళగావి (కర్నాటక): కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌ శుక్రవారం ఎమ్మెల్యేలతో రాజకీయ విందు సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. బెళగావి శివార్లలో ఎమ్మెల్యేలతో జరిగినట్లు చెబుతున్న డిన్నర్‌‌‌‌ మీట్‌‌ గురించి ఆయన శనివారం మీడియాకు వివరణ ఇచ్చారు. ‘‘దొడ్డన్నవర్ బెళగావి జిల్లా కాంగ్రెస్‌‌ మాజీ అధ్యక్షుడు. పైగా ఆయన నా ఫ్రెండ్‌‌ కూడా.. చాలా కాలంగా ఆయన నన్ను విందుకు తన ఇంటికి పిలిచాడు. నా కాంగ్రెస్‌‌ కుటుంబాన్ని నేను ఎలా మర్చిపోగలను? అందుకే నేను.. మరికొందరితో కలిసి అక్కడికి వెళ్లాం.. ఇది రాజకీయ సమావేశం కాదు.. పూర్తిగా వ్యక్తిగతం”అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సహచరులు ఆప్యాయంగా పిలవడంతోనే తాను అక్కడికి వెళ్లానని చెప్పారు.

 పార్టీ కార్యకర్తలు, సహచరుల నుంచి తనకు తరచుగా అనధికారిక డిన్నర్‌‌‌‌ ఆహ్వానాలు వస్తాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో కాకుండా మర్యాదపూర్వకంగా తాను వాటికి హాజరవుతానని వెల్లడించారు. మరోవైపు, బెంగళూరు సిటీ ప్రతిష్టతను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌‌ మ్యాచ్‌‌లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యత హోం మంత్రి పరమేశ్వరకు అప్పగించామని వెల్లడించారు.