వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు సాఫీగా జరిగేలా అధికారులు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 14న 7 మండలాల్లో పోలింగ్ ఉందన్నారు. 13 ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, సాయంత్రం పోలింగ్ మెటీరియల్ ను తీసుకొని బూత్‌లకు వెళ్లిపోవాలన్నారు. గుర్తింపు లేని వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డివో వాసుచంద్ర, డీపీవో జయసుధ పాల్గొన్నారు.

