కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘నేకు కరోనా సోకినట్లు తేలింది. ముందుజాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. నాతో సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అలాగే తమను తాము క్వారంటైన్ చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అని సిద్దరామయ్య ట్వీట్ చేశారు.

అధిక జ్వరంతో బాధపడుతున్న కర్ణాటక మాజీ సిఎం సిద్దరామయ్యను సోమవారం ఉదయం 12 గంటల సమయంలో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. ‘నా తండ్రికి సోమవారం జ్వరం వల్ల ఆసుపత్రిలో చేరారు. అక్కడ యాంటిజెన్ పరీక్ష చేస్తే.. కరోనా పాజిటివ్ వచ్చింది’ అని ఆయన సిద్దరామయ్య కుమారుడు యతింద్ర తెలిపారు. తన తండ్రితో కాంటాక్ట్ లో ఉన్నవాళ్లందరూ క్వారంటైన్ విధించుకోవాలని ఆయన కోరారు.

‘సిద్దరామయ్య ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మల్టీడిసిప్లినరీ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది’ అని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

For More News..

జైలు ముందు పేలిన కారు బాంబు.. 29 మంది మృతి

3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు