దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయొచ్చు

దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయొచ్చు

కరోనా వ్యాప్తి ని అడ్డుకోవాలంటే లాక్ డౌన్ ను  కొన సాగించాలని చాలా రాష్ట్రాలు  డిమాండ్ చేస్తున్నా యి. లాక్ డౌన్ ను  ఎత్తివేస్తే పరిస్థి తి చేయిదాటిపోయే ప్రమా దం ఉందని, అమెరికా తరహాలో కేసులు భారీగా పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నా యి. కానీ కర్నాటక మాత్రం లాక్డౌన్ ఎత్తివేతపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై స్టడీ చేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీని  నియమించింది.

ఆ రాష్ట్రప్రభుత్వానికి  రిపోర్టు సమర్పించిన కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఈనెల 14 తర్వాత లాక్ డౌన్  కొనసాగించడానికి ఎలాంటి ‘మెడికల్ రీజన్’ లేదని చెప్పింది. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయవచ్చని, అయితే  హాట్ స్పాట్ లో మాత్రం ప్రొహిబైటరీ ఆర్డర్స్  జారీ చేయాలని సూచించింది. కమిటీ సూచనలను యడియూరప్ప ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంద ని, ఒకట్రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సీఎంవో ఆఫీసు అధికారి ఒకరు చెప్పారు. ప్యానెల్ సిఫార్సులు ఇవీ.. నారాయణ హృదయాలయ ఆస్పత్రుల ఫౌండర్, డాక్టర్ దేవి శెట్టి ఆధ్వర్యంలో ప్రభుత్వం హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది . బుధవారం సాయంత్రం కర్నాటక ప్రభుత్వానికి ఈ ప్యానెల్ రిపోర్ట్ ను సమర్పించింది.

లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో వేలాది మంది వలస కార్మి కులు ఆదాయం, ఆహారం లేక విలవిల్లాడుతున్నా రు. ప్రజల్లో నెలకొన్న ఫ్రస్టెసన్ ను  నివారించడానికి, వారిలో నమ్మకాన్నికలిగించడానికి, చాలామందికి జీవనోపాధి అందించేందుకు.. దశల వారీగాలాక్ డౌన్ ఎత్తేయడం చాలా అవసరం. ఐటీ, బిజినెస్ టెక్నాలజీ సంస్థలు, ఇతర వ్యాపా ర సంస్థలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంచేసేలా ప్రోత్సహించాలి.

వర్క్ ఫ్లో  50 శాతం మంది ఆఫీసుల్లో పనిచేసేలా చూసుకోవాలి. ఆర్గనైజ్ డ్  సెక్టార్లోని ఇండస్ర్టీ లను ఎంకరేజ్ చేయాలి.

ఫ్యాక్టరీలు పలు సంస్థలు  తిరిగి తెరుచుకుని 50 శాతం ఉత్పత్తి జరిగేలా చూడాలి.

ప్రతి ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించాలి.

నిర్మాణ రంగం కూడా తిరిగి ప్రారంభం కావాలి.

ప్రభుత్వం గుర్తించిన హాట్ స్పాట్ లలో  రెండు వారాలు లాక్డౌన్ కొనసాగించాలి.

ఏప్రిల్ 3 0 వరకు రాష్ట్రంలో  ఆంక్షలు కొనసా గించాలి.

ఇంటర్ స్టేట్ బోర్డ్ లను మూసేయాలి.

విమానాలు, రైళ్లు, ఏసీ బస్సులు, మెట్రో బస్సులు తిప్పవద్దు.

కేవలం గూడ్స్ వెహికల్స్ ను  మాత్రమే అనుమతించాలి.

ఇంకా ఏం చెప్పిందంటే.. మే 31 వరకు ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్   నియమాలు కచ్చితంగా పాటించేలా కఠినంగా వ్యవహరించాలి.

పబ్లిక్ ప్లేసుల్లో ఆరుగురి కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చూడాలి.

అవసరమైన చోట 144 సెక్షన్ను విధించాలి.

జిమ్లు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మత సంస్థలు, పెళ్ళ్లిలుసహా ఇతర ఫంక్షన్లు ఏప్రిల్ 30 వరకు ఆపేయాలి.

చూయింగ్ గమ్ నమలడాన్నిబ్యాన్ చేయాలి.

పాన్ తినడం పైనా ఆంక్షలు విధించాలి.

ఏసీలు వాడకుండా షాప్లు ఇతర, సంస్థలు నడవాలి.

స్టూడెంట్లకు ఆన్ లైన్ లో క్లాసులు  నిర్వహించాలి.

మరిన్ని టెస్టింగ్  కిట్లను తెప్పించుకోవాలి.

ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్  కిట్ల వాడకంపై ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలి.

అవసరమైన అన్నిసేవలు నడపాలి.

గ్రామీణ వ్యవ సాయ కార్యకలాపాలను మరింత పెంచాలి.

జనం ఎక్కువగా ఉండేప్రాంతాల్లో కామన్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలి

. సీనియర్ సిటిజన్లు ఇంట్లోనే ఉండాలని కఠిన ఆర్డర్స్  ఇవ్వాలి.

‘‘ప్రభుత్వం దశలవారీగా ‘ఎగ్జిట్’కి ప్లాన్ చేయాలి.

కొవిడ్-19 అనేది 3 నెలల వయస్సున్న వైరస్. ఏప్రిల్ లో రెండు వారాలు ముగిశాక గ్రౌండ్ రియాలిటీ పరిస్థితులు ఎలా ఉంటాయనే దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. అందుకే ఈనెల 15 నుంచి 30 వరకు రెండు వారాల యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయాలి’’ – హైపవర్డ్ ఎక్స్ పర్ట్  కమిటీ రిపోర్ట్

 ‘‘కరోనా వైరస్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు.

బాధితుల కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ను పొడిగించాలని చెప్పిన పంజాబ్ను మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇది మనకు ఉపయోగపడుతుంది’’ – కర్నాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు