కర్నాటక మంత్రికి హర్ట్ ఎటాక్: హాస్పిటల్ లో మృతి

కర్నాటక మంత్రికి హర్ట్ ఎటాక్: హాస్పిటల్ లో మృతి

కర్ణాటక మున్సిపల్ శాఖ మంత్రి సీఎన్ శివపల్లి (58) హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. రెండు రోజుల క్రితం దర్వాడాలో ఒక భవనం కూలిపోగా.. ప్రమాదం జరిగిన వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి సీఎన్ శివపల్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దర్వాడా లోని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మంత్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వారి బధ్రతా సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు మంత్రి శివపల్లి. కొద్ది రోజుల క్రితమే శివపల్లికి హర్ట్ సర్జరీ అయినట్లు తెలిపారు వారి కుటుంబ సభ్యులు.

శివపల్లి 1999లో మొదటిసారి ఇండిపెండెంట్ గా పోటీచేసి MLAగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2008 లో పోటీచేయగా ఓడిపోయారు… 2013, 2018 ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే.. శివపల్లి మరణంతో.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోఖ సంద్రంలో మునిగారు.