నీలకురింజి పూలు..12 ఏళ్లకోసారి పూయడం వీటి ప్రత్యేకత

నీలకురింజి పూలు..12 ఏళ్లకోసారి పూయడం వీటి ప్రత్యేకత

కర్ణాటకలోని కూర్గ్ లో నీలకురింజి పూలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి అందాలకు, పర్యాటకానికి పెట్టింది పేరు కూర్గ్ జిల్లా. అక్కడి మండల్ పట్టి, కొటె బెట్టా కొండలపై నీలకురింజి పూలు వికసించాయి. 12 ఏళ్లకోసారి మాత్రమే పూయడం వీటి ప్రత్యేకత. నీలకురింజి పూలు పేరుకు తగ్గట్టే నీలం రంగులో ఉంటాయి. లక్షలాది పుష్పాలు ఒక్కసారిగా వికసించడంతో... మండల్ పట్టి, కొటె బెట్టా పర్వతాలను నీలి రంగు అలుముకుంది. నీలకురింజి అందాలను చూసేందుకు పర్యాటకులకు కూడా భారీగానే వస్తున్నారు.