ఓలా..ఉబర్..ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

ఓలా..ఉబర్..ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మూడు రోజుల్లో సర్వీసులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓలా, ఉబర్లు రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ 100 రూపాయలు వసూల్ చేస్తున్నాయంటూ ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 

ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఎక్కువ ధరలు వసూల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వెంటనే వాటిని నిషేధిస్తున్నామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టీహెచ్ఎం కుమార్ తెలిపారు. కర్ణాటకలో కనీస ఆటో చార్జ్ మొదటి 2 కిలోమీటర్లకు 30, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు 15 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటూ క్యాబ్లలో ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.