కర్ణాటక పోలీసుల కస్టడీకి వరవరరావు

కర్ణాటక పోలీసుల కస్టడీకి వరవరరావు

ఆ రాష్ట్ర పోలీసులపై నక్సల్స్‌ దాడి కేసులో

పుణే: విరసం నేత వరవరరావును కర్నాటక పోలీ సులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ బెటాలియన్‌పై నక్సల్స్‌ దాడి చేసిన కేసులో ఆయన్ను కస్టడీకి తీసుకున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 2005 తుమకూరు నక్సల్‌ దాడికి సంబంధించి ఎల్గార్‌ పరిషత్‌ (సదస్సు) కేసులో నిందితుడైన వరవరరావు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

2005 ఫిబ్రవరి 6న కర్నాటకలో నక్సల్ లీడర్‌ సాకేత్‌ రాజన్‌ అలియాస్‌ ప్రేమ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీనికి ప్రతీకారంగా తుముకూరు జిల్లా వెంకమ్మనహళ్లిలో ఉన్న కర్నాటక స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ (కేఎస్‌ఆర్‌పీ) బెటాలియన్‌పై నక్సల్స్‌ దాడి చేసి ఏడుగురు పోలీసులు, ఓ పౌరుడిని బలితీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న పుణే పోలీసులు గతేడాది ఆగస్టు 28న రావును అరెస్టు చేశారు. ఆయనతో పాటు యాక్టివిస్టులు సుధా భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్నాన్‌ గోంజాలెజ్‌, గౌతమ్‌ నవలఖాలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మావోయిస్టులతో సంబంధాలున్నాయని, వాళ్ల కు ఆయుధాలు, మందుగుండు, డబ్బులు అందించడంలో సహకరించారని, స్టూడెంట్లను దళంలోకి తీసుకోవడంలో కీలక పాత్ర అని వరవరరావుపై అభియోగాలున్నాయి.