జూరాలకు  కర్నాటక నీళ్లు... సీఎం డీకేతో తెలంగాణ మంత్రుల చర్చలు సఫలం

జూరాలకు  కర్నాటక నీళ్లు... సీఎం డీకేతో తెలంగాణ మంత్రుల చర్చలు సఫలం
  • నారాయణపూర్ నుంచి విడతలవారీగా 3 టీఎంసీలు
  • 10 రోజుల పాటు వారబందీ పద్ధతిన రిలీజ్
  • జూరాల కెనాల్స్ నుంచి నీటి విడుదల ప్రారంభం
  • ఎత్తిపోతల పథకాలకూ పంపింగ్ షురూ

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్/గద్వాల, వెలుగు: కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం రెండు రోజులపాటు జరిపిన చర్చలు ఫలించాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అక్కడి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు 10 రోజులపాటు వారబందీ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 3 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేస్తామని ప్రకటించింది. 

దీంతో జూరాల నుంచి వెంటనే నీటిని రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇరిగేషన్  ఆఫీసర్లు బుధవారం మధ్యాహ్నం నుంచి జూరాల లెఫ్ట్, రైట్ కెనాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు.. ఈ ప్రాజెక్టు పరిధిలోని నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ లిఫ్టుల నుంచి పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

కర్నాటక సీఎంతో రెండు రోజులపాటు చర్చలు

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో కారణంగా వర్షాల్లేక జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు సాగునీటి కోసం 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రాజెక్టులో తాగునీటి అవసరాల కోసం కేవలం 5 టీఎంసీలు మాత్రమే నీరు ఉండడంతో పైనుంచి వరద వస్తే తప్ప సాగుకు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.  

దీంతో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణా రెడ్డి మంగళవారం ఉదయం సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వీరంతా అదేరోజు మధ్యాహ్నం హుటాహుటిన కర్నాటకకు వెళ్లి, సాయంత్రం ఆ రాష్ట్ర సీఎం డీకే శివ కుమార్‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. ఈ అంశంపై  మరుసటి రోజు మళ్లీ సమావేశం అవుదామని తెలంగాణ ప్రజాప్రతినిధులకు డీకే సూచించారు. 

ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన కర్నాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా, ఇరిగేషన్ సెక్రటరీ షావ్వ రామ స్వామి, కర్నాటక సీఎం నీటి పారుదల సలహాదారు విశ్వనాథ రెడ్డితో కలిసి తెలంగాణ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నారాయణపూర్, ఆల్మట్టి జలాశయాల నుంచి జూరాలకు నీటి విడుదల చేసే అంశంపై చర్చించారు. అక్కడి ఆఫీసర్ల సూచన మేరకు నారాయణపూర్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 3 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసేందుకు డీకే అంగీకరించారు. 

ఈ మేరకు వెంటనే  విడుదల చేయాలని ఆ రాష్ట్ర ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో కర్నాటక సీఎంకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కాగా.. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఆఫీసర్లతో గురు వారం సమావేశం కానున్నామని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌‌‌ సాగర్ ప్రాజెక్టుల నుంచి సాగు, తాగునీటి అవసరాలు, కర్నాటక నుంచి వస్తున్న నీటిని ఎలా వాడుకోవాలనే అంశంపై చర్చిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి తెలిపారు.

జూరాల కాలువలు, లిఫ్ట్‌‌‌‌లకు నీటి విడుదల

నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి విడుదలకు కర్నాటక ప్రభుత్వం ఓకే చెప్పడంతో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జూరాల లెఫ్ట్, రైట్ మెయిన్ కెనాల్స్‌‌‌‌తో ఆ ప్రాజెక్టు పరిధిలోని లిఫ్ట్‌‌‌‌లకు నీటిని తరలిస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు  ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదైంది. 

ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్‌‌‌‌కు వెయ్యి క్యూసెక్కులు, రైట్ మెయిన్ కెనాల్‌‌‌‌కు 717, ప్యారలల్ కెనాల్‌‌‌‌కు500, భీమా లిఫ్ట్–1కు 650, భీమా లిఫ్ట్–2కు 750, నెట్టెంపాడుకు 1,500, కోయిల్‌‌‌‌సాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాల్వల్లో నీళ్లు వస్తుండడంతో ఆయకట్టు రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది.