
కర్ణాటకలో నీటి యోధుడిగా పేరుగాంచిన కల్మనే కామెగౌడ (86) కన్నుమూశారు. మాండ్యా జిల్లాకు చెందిన ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. మాండ్య జిల్లాకు చెందిన కామెగౌడ పశువుల కాపరి.. ఆయన తన స్వగ్రామంలో కొండలను తవ్వి 17 చెరువులను నిర్మించారు. 2000 మొక్కలను నాటారు. వాటి సంరక్షణ కూడా ఆయనే చూసుకునేవారు.
నీటి సంరక్షణ కోసం ఆయన చేసిన కృషిని ఓ సారి ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఆయనను వాటర్ వారియర్ గా మోడీ అభివర్ణించారు. కామెగౌడ మృతిపట్ల సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. కామెగౌడ మృతి చెందారనే వార్త వినడం చాలా బాధాకరంగా ఉందన్నారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, కుమారస్వామి కూడా కామెగౌడ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
కామెగౌడ ప్రయాత్నాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008లో రాజ్యోత్సవ, బసవశ్రీ అవార్డులతో సత్కరించింది. కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ (KSRTC) ఆయనకు జీవిత కాల ఉచిత బస్సు పాస్‌ను కూడా అందజేసింది.