గాంధీ ఆస్పత్రికి ‘కరోనా’ కిట్లు

గాంధీ ఆస్పత్రికి ‘కరోనా’ కిట్లు

సస్పెక్టెడ్  కేసుల శాంపిల్స్​తో ట్రయల్స్​ 

ఇప్పటిదాకా పుణెలో 11 మందికి టెస్టులు

9మందికి నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  ఇంకో ఇద్దరి రిజల్ట్స్​కోసం వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో నలుగురు అనుమానితులు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు శుక్రవారం గాంధీ దవాఖానకు చేరినయి. ఇప్పటిమటుకు అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కరోనా అనుమానితుల శాంపిళ్లను వీటితో టెస్ట్​ చేస్తున్నరు. అయితే, ఇది ట్రయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమేనని, పుణే వైరాలజీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ట్రయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్​పై సంతృప్తి చెందితే పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తమని నోడల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్ విజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దీనికి ఒకటి, రెండు దినాలు పట్టే అవకాశం ఉందన్నరు. గాంధీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్లు కరోనా ట్రయల్ డయాగ్నసిస్ చేస్తున్నరు. ఈ కిట్స్​తో 5 నుంచి 6 గంటల్లోనే రిజల్ట్​ వస్తుందని డాక్టర్లు చెప్తున్నరు. ఇప్పటికే గాంధీలో వార్డు బాయ్ లు, నర్సులకు, శానిటేషన్ సిబ్బందికి ట్రైనింగ్​ ఇచ్చినమని, శనివారం అన్ని డిపార్ట్​మెంట్ల మెడికల్​ఆఫీసర్లకు శిక్షణ ఇస్తమని గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్ శ్రావణ్ చెప్పారు. వీళ్ల కోసం 140 స్పెషల్ డ్రెస్సులు రెడీ చేశామన్నరు. రోజంతా ఏడుగురు డాక్టర్ల టీం షిప్టుల వారీగా పని చేస్తుందన్నరు.

మరో 4 సస్పెక్టెడ్ కేసులు

కొన్ని రోజుల కింద చైనా నుంచి వచ్చిన నలు గురు శుక్రవారం ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వీళ్లకు జలుబు, దగ్గు, జ్వరం ఉండడంతో ఐసొలేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డులో అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఉంచారు. శనివారం వీళ్ల శాంపిల్స్​టెస్టుల కోసం పంపించనున్నరు. ఈ నలుగురితో కలిపి మొత్తం సస్పెక్టెడ్ కేసుల సంఖ్య 15కు చేరింది. 9 మంది రిజల్ట్స్​నెగటివ్​రావడంతో ఇండ్లకు పంపించారు. ఇప్పుడు ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదుగురు, గాంధీలో ఒకరు అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నరు. ఇగ స్పెషల్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనా నుంచి తీసుకొస్తున్న ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీలోనే క్వారంటైన్ చేయనున్నరు. 360 మంది ఈ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తున్నట్టు అధికారులు చెప్పారు. అయితే, ఇందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది ఉన్నరో తెలియలేదు.

తెలంగాణలో కరోనా లేనే లేదు

తెలంగాణలో కరోనా వైరస్ లేదని, ఉత్తగ భయపడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. చైనాలోని తెలంగాణోళ్లంతా వాపస్ వస్తున్నరని, ప్రతి ఒక్కళ్లను ఎయిర్ పోర్ట్ నుంచి హాస్పిటల్ కు తీసుకుపోయి టెస్టులు చేస్తమన్నరు. వైరస్ లేదని డిసైడ్​ చేసిన తర్వాతనే ఇంటికి పంపుతమన్నరు. డబ్ల్యూహెచ్ఓ ఈ ఏడాదిని నర్సెస్ ఇయర్ గా అనౌన్స్​ చేసిన సందర్భంగా తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ  ఆధ్వర్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఓ ప్రోగ్రాం పెట్టారు. దీనికి మంత్రి చీఫ్​ గెస్ట్​గా వచ్చి మీడియాతో మాట్టాడారు. ఈ మధ్య కరోనా వైరస్ పై తెలిసీ, తెలియకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నరని, అసొంటి పనులు చేయవద్దని కోరారు.

మన మెడిసిన్​తో తగ్గించొచ్చు

సీనియర్​ పల్మనాలజిస్టులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా వైరస్ సోకినంత మాత్రాన ప్రాణాలకు ప్రమాదం ఉండదంటున్నరు సీనియర్ పల్మనాలజిస్టులు. అయితే, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే చిన్నపిల్లలు, ముసలివాళ్లు, షుగర్​ పేషంట్లు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లు, కిడ్నీ, కేన్సర్ లతో బాధపడుతున్నోళ్లకు ఎఫెక్ట్​ చూపిస్తుందంటున్నరు. కరోనా కూడా స్వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూ లెక్కనే రెస్పిరేటరీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైన దాడి చేస్తుందని సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్మనాలజిస్ట్, కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమణ ప్రసాద్ చెప్పారు. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకితే పడిశం, ఎక్కువ జ్వరం, దగ్గు, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులొస్తయన్నరు. వైరస్ బాడీలో స్ర్పెడ్ అవుతున్నకొద్దీ ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరి న్యుమోనియాతో బాడీలోని ఇతర పార్ట్స్​దెబ్బతింటయన్నరు. జనరల్ ఫ్లూ న్యుమోనియాకు, కరోనా న్యుమోనియాకు పెద్దగా డిఫరెన్స్ లేదని సీనియర్ పల్మనాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అపోలో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెడిసిన్, వ్యాక్సిన్​ లేవని, యూత్, మిడిల్ ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లకు సోకితే మన దగ్గరున్న ఫ్లూ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాంటి బయాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తగ్గించొచ్చన్నరు. ప్రెగ్నెంట్ వుమెన్, పిల్లలు, వ్యాధిగ్రస్తులు..జనం ఎక్కువగా ఉండే ప్లేసులకు పోకపోవడమే మంచిదన్నరు. ప్రతి ఒక్కళ్లూ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌95 మాస్క్ యూజ్ చేయాలన్నరు. ఎప్పటికప్పుడు సానిటైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హ్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాష్ చేసుకోవాలని,  టెంపరేచర్ పెరిగితే వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల స్పెడ్​ కాదన్నరు. ఉదాహరణకు 100 మందికి వైరస్​ సోకితే ముగ్గురో, నలుగురో చనిపోతున్నరని చెప్పిన్రు. కాబట్టి భయపడొద్దన్నరు.