వచ్చే దీపావళికి మరో హిట్ ఇస్తానంటున్న కిరణ్ అబ్బవరం..

వచ్చే దీపావళికి మరో హిట్ ఇస్తానంటున్న కిరణ్ అబ్బవరం..

తన  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా ‘కె ర్యాంప్’ విజయం  ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది అని కిరణ్ అబ్బవరం అన్నాడు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా  దీపావళికి విడుదలై  రూ. 40 కోట్లకు  పైగా వసూళ్లను సాధించి థర్డ్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌లోనూ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఏపీ  ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నిర్మాత బండ్ల గణేష్ అతిథులుగా హాజరై మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు సక్సెస్ షీల్డ్‌‌‌‌‌‌‌‌లను అందజేశారు.  

కిరణ్​ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ సినిమా ఎంత వసూళ్లు   చేసింది అనే దానికంటే థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి సినిమా చూస్తూ నవ్వుకోవడం హీరోగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది.  పండక్కి మీ అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తామనే  నమ్మకం నిజం కావడం హ్యాపీగా ఉంది.  గతేడాది, ఈ ఏడాది దీపావళికి హిట్ ఇచ్చాం.  ప్రేక్షకుల  సపోర్ట్ ఉంటే వచ్చే దీపావళికి కూడా హిట్ సినిమా ఇస్తాను’ అని అన్నాడు. టీమ్ అంతా పాల్గొని సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.