ప్రో రెజ్లింగ్ లీగ్ రీఎంట్రీ.. ఐపీఎల్ తరహా ఫ్రాంచైజీ మోడల్లో రీస్టార్ట్

ప్రో రెజ్లింగ్ లీగ్ రీఎంట్రీ.. ఐపీఎల్ తరహా ఫ్రాంచైజీ మోడల్లో రీస్టార్ట్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రో రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్‌‌) తిరిగి పట్టాలెక్కనుంది.  2019లో చివరిసారిగా జరిగిన ఈ లీగ్‌‌ను  ఐపీఎల్ తరహా ఫ్రాంచైజీ మోడల్‌‌లో  వచ్చే జనవరిలో రీస్టార్ట్‌‌ చేస్తున్నట్టు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌ఐ) మంగళవారం (నవంబర్ 04) ప్రకటించింది.

 దేశ పురాతన క్రీడను ప్రపంచ స్థాయికి, ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్ వేదిక అవుతుందని డబ్ల్యూఎఫ్‌‌ఐ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్‌‌‌‌, మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషన్ ప్రకటించారు. ఈ లీగ్  స్థానిక రెజ్లర్ల టాలెంట్‌ను అంతర్జాతీయ వేదికకు చేర్చుతుందని అన్నారు. ఇందులో ఇండియా టాప్  రెజ్లర్లతో పాటు రష్యా, కజకిస్తాన్ వంటి దేశాల కుస్తీ వీరులు కూడా పాల్గొంటారని, పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.