
చండీగఢ్: పహల్గాం దాడి వల్ల భారత్–-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగినప్పటికీ, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ వద్ద ఉన్న కర్తాపూర్ కారిడార్ తెరిచే ఉందని టూరిస్టులు తెలిపారు. ఇది భారతీయ సిక్కు యాత్రికులకు పాకిస్తాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తాపూర్‌కు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నది.
ఈ కారిడార్ 2019లో ప్రారంభమైంది. ఇది డేరా బాబా నానక్‌ను.. పాకిస్తాన్‌లోని కర్తాపూర్తో అనుసంధానిస్తుంది. అయితే, పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌కు వెళ్లే అటారీ బోర్డర్‌ను భారత్ మూసివేసినా.. శుక్రవారం కర్తాపూర్ కారిడార్ మాత్రం తెరిచే ఉందని యాత్రికులు శుక్రవారం పేర్కొన్నారు.