కార్తీక మాసం ఉసిరికాయ ఉసిరి దీపం వెలిగించి నీటిలో వదులుతారు. అసలు ఉసిరి గుండ్రంగా ఉంటుంది దానితో దీపం ఎలా పెట్టాలి..? ఎలా వెలిగించాలి..ఉసిరికాయ దీపం వల్ల కలిగే లాభాలు ఏమిటి..? ఉసిరితో దీపం వెలిగించడం ఎవరు ప్రారంభించారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. పండితులు.. పురాణాలు ఏం చెబుతున్నాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రాముఖ్యమైనది. పురాణాల ప్రకారం ఈ నెల రోజులకు ఎంతో విశిష్టత.. ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా పవర్ ఫుల్డే అని పండితులు చెబుతున్నారు. అందుకే శివాలయాల్లో 365 వత్తులు.. ఉసిరి దీపం వెలిగిస్తారు.
స్కంధ పురాణం ప్రకారం ఉసిరి చెట్టులో శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు.., ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసంలో దీపాలు ప్రధానం.కార్తీక మాసం నెల రోజులు ఆవునెయ్యి దీపారాధన చేస్తారు. పౌర్ణమి రోజున పత్తితో తయారు చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దోనెల్లో ప్రమిదలు పెట్టి వెలిగిస్తారు. ఆతరువాత కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదలాలి.
కార్తీక మాసంలో 'ఉసిరి దీపాల'కి ఓ ప్రత్యేకత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం మంచిదని అందరికీ తెలుసు..కానీ ఉసిరి కాయ తో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని..నవ గ్రహ దోషాలు పరిహారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఉసిరి దీపం .. పురాణ కథ..
వశిష్ఠ మహాముని శౌనకాది మునులకు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం గురించి ఒక పురాణం ఉందని వివరించాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కార్తీక మాసంలో శివుడిని పూజించాలని కోరుకున్నారు. కానీ అక్కడ శివాలయం లేదు, శివలింగం లేదు. ద్రౌపది ఏమి చేయాలో ఆలోచిస్తుండగా, శ్రీకృష్ణుడు ఆమెకు ఇలా ఉపదేశించాడు. ఇప్పుడు కార్తీకమాసంలో.. మీరు.. మీ భర్త కొన్ని గ్రహాల చెడు ఫలితాల వల్ల జూదంలో ఓడిపోయి.. ఇలా బాధపడుతున్నారు. కార్తీకమాసంలో ఉసిరి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాల పరిహారాలు లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొనబడింది.
ఉసిరి దీపం మొదట వెలిగించింది ఎవరంటే..
ఆధ్యాత్మికవేత్తల ప్రకారం, ద్రౌపది ఒక గుండ్రని ఉసిరి చెట్టు పైభాగాన్ని తీసివేసి, అందులో ఆవు నెయ్యి, తెల్లటి వత్తులతో దీపారాధన చేసింది. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన తర్వాత ధర్మరాజు యుద్ధానికి అంగీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దుష్టశక్తులు దూరమై తిరిగి రాజ్యానికి రావడానికి బీజం వేసినట్లు పండితులు చెబుతున్నారు.
ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే..
- కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే..దీపంలో సిద్ధమవుతుంది.
- బెజ్జంలో నెయ్యి నింపి అందులో తామరపువ్వుల వత్తులు వేసి దీపం వెలిగించాలి.
- ఉసిరి దీపం ఇలా వెలిగిస్తే విష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల సంపదలతో పాటు మహిళలు సుఖసంతోషాలతో మరణిస్తారని అంటారు.
- ఉసిరి లక్ష్మీదేవికి ఇష్టమైనది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
- కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదిష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
