కొందరి కళ్లలో ఆనందం కోసమే చిదంబరం ను CBI అరెస్ట్ చేసిందని ఆరోపించారు ఆయన కొడుకు కార్తి చిదంబరం. విచారణ నిజాయతీగా జరగలేదన్న కార్తి… కొన్ని టీవీ చానెళ్లలో డ్రామా కోసమే చేసినట్టుగా ఉందన్నారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు చిదంబరంను అరెస్ట్ చేశారని చెప్పారు. అసలు చిదంబరంను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదన్న కార్తి… కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో రాజకీయంగా, చట్టపరంగా పోరాడతామన్నారు.
చిదంబరం ప్రస్తుతం ఢిల్లీలోని CBI హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. 2011 జూన్ 30న ఈ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాగా… చిదంబరం హోంమంత్రిగా ఉన్నారు. మొత్తంగా తన హయాంలో ప్రారంభమైన CBI ఆఫీస్ లోకే ఇప్పుడు ఆయన నిందితుడిగా వెళ్లారు.
