పవర్‌‌‌‌ఫుల్ గెటప్‌‌లో సర్దార్2

పవర్‌‌‌‌ఫుల్ గెటప్‌‌లో సర్దార్2

కోలీవుడ్ స్టార్ కార్తి  హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్దార్ 2’. మూడేళ్ల  క్రితం ‘సర్దార్’గా సక్సెస్ అందుకోగా, ఇప్పుడు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదివారం కార్తి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్  పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో  కార్తి మ్యాసీవ్  మిషన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. సినిమాలో కార్తి క్యారెక్టర్ ఎంత పవర్‌‌‌‌ఫుల్‌‌గా ఉండబోతోందో ఈ పోస్టర్ తెలియజేస్తోంది.

 ప్రస్తుతం ఈ మూవీ   షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా, ఎస్ జె సూర్య  కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై  ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు మరో నాలుగైదు ప్రాజెక్టులకు కమిట్ అయిన కార్తికు బర్త్‌‌డే విషెస్‌‌ను తెలియజేశారు ఆయా మూవీ మేకర్స్.