Nilakanta: తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్. జనవరి 2న సినిమా విడుదల కానుండగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 29న జరిగిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన మహేంద్రన్.. ఇప్పుడు హీరోగా రాణించేందుకు చేస్తున్న ప్రయాణానికి పలువురు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు.
నీలకంఠ హీరోకు అండగా స్టార్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ తో పాటు మరికొందరు నటులు ముందు నుంచి అండగా నిలుస్తున్నారు. శివ నిర్వాణ, అజయ్ భూపతి, కిరణ్ అబ్బవరంతో పాటు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్, తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన కార్తీక్ సుబ్బరాజు (జిగర్తాండ, పేట ఫేమ్) కూడా ఈ సినిమా విజయం కోసం సపోర్ట్ చేస్తున్నారు.
సినిమా ప్రారంభం నుంచే మాస్టర్ మహేంద్రన్ వెన్నంటే ఉండి ప్రోత్సహించటంతో పాటు వారు తమ ఎక్స్ ఖాతాలో కూడా సినిమా ట్రైలర్ లాంచ్ పై పోస్ట్ పెడుతూ మూవీ టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. కొత్త హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంత మంది అండగా నిలవటంపై మహేంద్రన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెుత్తానికి పరిశ్రమలోని పెద్దల నుంచి మద్దతు లభించడం 'నీలకంఠ' చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించటానికి కొత్త ఏడాదిలో జనవరి 2న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది.
