Karthikamasam 2025: తొలి సోమవారం అక్టోబర్ 27.. దీపం.. దానం.. ఉపవాసం.. కోటి యాగాల ఫలం

Karthikamasam 2025: తొలి సోమవారం అక్టోబర్ 27.. దీపం.. దానం.. ఉపవాసం..  కోటి యాగాల ఫలం

 కార్తీక మాసం పవిత్రమైనది.... విశిష్టమైనది.  నిత్యం శివుడిని ఆరాధిస్తారు.  కార్తీక సోమవారం నాడు పరమేశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు.  ఈ ఏడాది ( 2025) మొదటి కార్తీక సోమవారం అక్టోబర్​ 27న వచ్చింది.   ఆ రోజున ఉపవాసం ఉండి.. దీపారాధాన చేసి.  దానం చేసిన వారికి కోటియాగాలు చేస్తే వచ్చి పుణ్య ఫలం వస్తుందనిపండితులు చెబుతున్నారు. ఆరోజు శివుడిని ఎలా పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

 కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ సంవత్సరం ( 2025)  కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్​ 27 వ  తేదీన వచ్చింది.శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవారం  తెల్లవారు జామున చేసే స్నానం, పూజా, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేశారు.  కార్తీకమాసం( Karthika Masam )లో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని ప్రజల నమ్ముతారు. శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తిక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. 

కార్తీక సోమవారం  ( 2025 అక్టోబర్​ 27) న చేసే  దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఈ నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు.కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.ఆ రోజున ఉపవాసం ఉండి.. దీపారాధాన చేసి.  దానం చేసిన వారికి కోటియాగాలు చేస్తే వచ్చి పుణ్య ఫలం వస్తుందనిపండితులు చెబుతున్నారు.

కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరుడిని  దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది.

కార్తీక మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో  సోమవారానికి  ఉండే ప్రాధాన్యత అంత ఇంతా కాదు.  ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పండితులు సలహాలతో పురాణాలు..ఆథ్యాత్మిక గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో పాటు  ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు.