మోహన్ రాజా డైరెక్షన్‌‌‌‌లో కార్తీ కొత్త సినిమా

మోహన్ రాజా డైరెక్షన్‌‌‌‌లో కార్తీ కొత్త సినిమా

వచ్చే నెలలో ‘సర్దార్‌‌‌‌‌‌‌‌ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరో కార్తి.. ఈ సినిమా రిలీజ్‌‌‌‌కు ముందే తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. 

దేవ్, సర్దార్, సర్దార్ 2 చిత్రాల తర్వాత ఈ సంస్థలో కార్తి చేస్తున్న నాలుగో సినిమా ఇది. సోమవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో పాటు హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌ కలగలిసిన ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌, షూటింగ్‌‌‌‌ వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.