వీరభద్రుడుగా సూర్య

వీరభద్రుడుగా సూర్య

సూర్య హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కరుప్పు’. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఈ మూవీ తెలుగు వెర్షన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌‌‌‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో నుదుటన విభూది, నల్ల చొక్కా, పంచెతో ట్రెడిషనల్‌‌‌‌గా కనిపిస్తున్న సూర్య, చేతిలో పెద్ద వేట కత్తితో పవర్‌‌‌‌ఫుల్ అవతార్‌‌‌‌లో ఉన్నాడు.

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్యకు జంటగా త్రిష నటిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.  సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. మే 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.