సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భార్య.. వెల్దుర్తి మండలంలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసిన నజ్మా సుల్తానా

సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భార్య.. వెల్దుర్తి మండలంలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసిన నజ్మా సుల్తానా

వెల్దుర్తి, వెలుగు : ఓ ఎమ్మెల్యే భార్య సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కార్వాన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కౌసర్‌‌‌‌‌‌‌‌ మొహినొద్దీన్‌‌‌‌‌‌‌‌ భార్య నజ్మా సుల్తానా తన సొంత గ్రామమైన మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఆమె గతంలోనే కార్వాన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా విజయం సాధించారు. ఇప్పుడు తన సొంతూరైన బస్వాపూర్‌‌‌‌‌‌‌‌లో రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసి రావడంతో పోటీకి దిగారు.