ఈ అభ్యర్థి మాకొద్దు..పార్టీ నాయకుల మౌన ప్రదర్శన

ఈ అభ్యర్థి మాకొద్దు..పార్టీ నాయకుల మౌన ప్రదర్శన
  • కార్వాన్ కాంగ్రెస్ క్యాండిడేట్​ను వ్యతిరేకిస్తూ బాపూఘాట్​లో పార్టీ నాయకుల మౌన ప్రదర్శన

మెహిదీపట్నం, వెలుగు : కార్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ బిన్ హజారేను వెంటనే మార్చాలని లేకపోతే తాము సహకరించమని సెగ్మెంట్​కు చెందిన పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. మంగళవారం బాపూఘాట్​లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కార్వాన్ సెగ్మెంట్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ, బీ బ్లాక్ అధ్యక్షుడు చంటిబాబు

 గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రఘుపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థిని మార్చాలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రేకు వినతిపత్రం ఇచ్చామన్నారు. పార్టీలో పనిచేసే వారికి కార్వాన్ టికెట్​ను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.