వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో ఉమెన్‍ స్పెషల్‍ పోలీస్‍ ఫోర్స్ భేష్‍

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో ఉమెన్‍ స్పెషల్‍ పోలీస్‍ ఫోర్స్ భేష్‍

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్‍ స్పెషల్‍ పోలీసుల పనితీరు భేష్‍ అంటూ వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ కితాబిచ్చారు. ఉమెన్స్​ టీం ఇటీవలే ట్రైనింగ్‍ పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం కమిషనరేట్‍ మైదానంలో మహిళా సిబ్బంది దేహాధారుడ్య, ఆయుధ శిక్షణలో వారి పనితీరును పరిశీలించారు.

 కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని చేసిన ఆయుధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళా సిబ్బంది విధుల్లో అత్యుత్తమంగా రాణించాలన్నారు. 

అనంతరం సిటీ ఆర్ముడ్‍ రిజర్వ్​విభాగాన్ని తనిఖీ చేశారు. డాగ్‍ స్కాడ్‍, బాంబ్‍ డిస్పోజబుల్‍, మోటార్‍, ఆయుధాగారం విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డీసీపీలు సురేశ్ కుమార్‍, శ్రీనివాస్‍, రవి, ట్రైనీ ఐపీఎస్‍ మనిషా నేహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్‍ఐ స్పర్జన్‍ రాజ్‍, సతీశ్, శ్రీధర్‍, చంద్రశేఖర్‍ పాల్గొన్నారు.