రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారు: వైఎస్ జగన్

రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారు: వైఎస్ జగన్

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారని అన్నారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( జనవరి 8 ) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్.చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారని అన్నారు. చంద్రబాబు లాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరు ఉండరని అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు జగన్.

రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. రాయలసీమ లిఫ్ట్ ఆపించామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై వాస్తవాలు ప్రజలందరికి తెలియాలని అన్నారు జగన్. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని కూటమి నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారని.. దీన్ని బట్టి చూస్తే కూటమికి రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోందని అన్నారు జగన్.

ఈ ప్రాజెక్టు రాయలసీమ, నెల్లూరుకు సంజీవని లాంటిదని.. అలాంటి ప్రాజెక్టును అవసరం లేదంటున్న వీళ్ళ మాటలు చూస్తుంటే.. మనుషులేనా అనిపిస్తుందని అన్నారు జగన్. చంద్రబాబు క్లోజ్ డోర్ మీటింగ్ లో అడిగారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చెప్పారని.. చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ అని ధ్వజమెత్తారు జగన్.

చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లు ఉందని అన్నారు. తన స్వార్థం కోసం  చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచారని.. ఇప్పుడు తనకు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని అన్నారు జగన్.