ఆంధ్రా కంటే తెలంగాణలో టీడీపీ బాగుంది : కాసాని జ్ణానేశ్వర్

ఆంధ్రా కంటే తెలంగాణలో టీడీపీ బాగుంది : కాసాని జ్ణానేశ్వర్

తెలంగాణలో  టీడీపీ పోటీ బాగుంటదని.. ఏపీ కంటే బాగుంటదన్నారు  రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఇపుడున్న అన్ని పార్టీల్లో కంటే టీడీపీ బెటర్ అని.. నాయకుల్లో చంద్రబాబు బెస్ట్ లీడర్ అని కొనియాడారు. చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయిన తర్వాత కాసాని మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ ఎన్నికల్లో   ఒంటరిగానే పోటీ చేస్తామని  కాసాని జ్ఞానేశ్వర్  అన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లపై పోటీ చేయాలనేది అక్టోబర్ 29న లోకేష్ తో చర్చించి చెబుతామన్నారు.  సాధ్యమైనంత వరకు అన్ని సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయడం లేదన్నారు. ఇతర పార్టీలోకి వెళుతున్నాననేది అవాస్తవమని. అది మీడియా సృష్టించేందనని కొట్టిపారేశారు. 

ఇప్పటి వరకు బీఆర్ఎస్ 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ 100 మంది, బీజేపీ 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించ లేదు.