కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కలిసి కాశ్మీర్ యాత్రకు వెళ్లారు. అక్కడ గురువారం గుండెపోటుతో విశాల్ చనిపోయినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యాత్రలో భాగంగా లడఖ్ ప్రాంతంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఒక్కసారిగా విశాల్ కు ఊపిరి ఆడక మృతి చెందిన్నట్లు చెప్పారు. డెడ్ బాడీ కోసం బంధువులు, ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు.
