పుల్వామా ఎన్ కౌంటర్:ఉగ్రవాది జకీర్ మూసా హతం

పుల్వామా ఎన్ కౌంటర్:ఉగ్రవాది జకీర్ మూసా హతం

జమ్మూకశ్మీర్ లో ని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భధ్రతా  బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆల్ ఖైదా అనుంబంధ ఉగ్రవాద సంస్థ అన్సార్- ఘజ్వత్- ఉల్- హింద్ కు చెందిన జకీర్ మూసా చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే  అతని కుటుంబ సభ్యులు మాత్రం.. కాల్పులు జరిగిన ప్రాంతంలో ముసా ఉన్నట్లు చెబుతున్నారు.

ఉగ్రవాది మూసాకు మద్దతుగా షోషియాన్, పుల్వామా, అవంతిపొర, శ్రీనగర్ లో కొంత మంది నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పలు చోట్ల ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. విద్యాసంస్థల్ని కూడా బంద్ చేశారు.

పుల్వామా జిల్లాలిన త్రాల్ సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతోనే  సోదాలు జరిపినట్లు తెలుపుతున్నారు పోలీసులు. అయితే తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు మోర్టార్లు, గ్రనేడ్లతో దాడులు చేశారని తెలిపారు. దీంతో తాము కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.