టీఆర్టీఎఫ్ స్టేట్ కమిటీ ఎన్నిక ప్రెసిడెంట్​గా కటకం రమేశ్

టీఆర్టీఎఫ్ స్టేట్ కమిటీ ఎన్నిక ప్రెసిడెంట్​గా కటకం రమేశ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కొత్త రాష్ట్ర  కార్యవర్గం ఎంపిక జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్​గా కటకం రమేశ్, జనరల్ సెక్రటరీగా అశోక్​కుమార్ ఎన్నికయ్యారు. స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్లుగా ధరావత్ రాములు, రవికుమార్, నందికొండ విద్యాసాగర్, రెంటాల రమణారెడ్డి, గజభీంకార్ గోవర్ధన్, జి.సదానందంతో పాటు మొత్తం 48మందితో కొత్త కమిటీని ఎన్నుకున్నట్లు నేతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా సీపీఎస్​రద్దుకు కార్యాచరణ చేపట్టాలని కటకం రమేశ్ విజ్ఞప్తి చేశారు. ప్రైమరీ స్కూళ్లల్లో పనిచేసే ఎస్జీటీ టీచర్లకూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. టీచర్లకు బదిలీలు నిర్వహించాలని, పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని, ఒకటో  తేదీన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.