కౌశిక్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్ జాన్వీ

కౌశిక్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్ జాన్వీ

హైదరాబాద్​, వెలుగు: సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ కౌశిక్ గోల్డ్ అండ్​ డైమండ్స్ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు.  తమ సంస్థ వ్యాపార ప్రకటనలో ఆమె కనిపిస్తారని సంస్థ తెలిపింది. 

కౌశిక్ గోల్డ్ అండ్​ డైమండ్స్ ఎండీ కునాల్ మాట్లాడుతూ ‘విజయవాడలో మా షోరూం ఉంది. బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ, విక్రయాలు మా ప్రత్యేకతలు. ప్రతి నగకూ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తాం. సంప్రదాయ ఆభరణాలతోపాటు,  డైమండ్ రింగులు, నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, చెవిపోగులు, పెళ్లి ఆభరణాలు అమ్ముతాం”అని ఆయన వివరించారు.