ఈటల పేదల భూములను కబ్జా చేశారన్న కౌశిక్ రెడ్డి

ఈటల పేదల భూములను కబ్జా చేశారన్న కౌశిక్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై  ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజురాబాద్ అభివృద్ది కోసం కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా తేలేకపోయారని విమర్శించారు . ఉప ఎన్నికల్లో ఈటలను గెలిపిస్తే..పేదల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఈటల కబ్జా చేసిన భూములను సీఎం కేసీఆర్ తిరిగి పేదలకే అందజేశారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి  నిధుల కోసం ఏ ఒక్క కేంద్రమంత్రినైనా, ప్రధాని మోడీనైనా అడిగావా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా  కేంద్రం నుంచి నియోజక వర్గానికి ఒక్క రూపాయైనా తెచ్చావా? అంటూ నిలదీశారు. ఈటల ఆస్తులను కాపాడుకునేందుకు ముఖమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈటల రాజేందర్ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగి,  ఆస్తులు పెంచుకున్నారన్నారు.2004 నుండి 2018 వరకు ఈటల కేసీఆర్ దగ్గర  బానిసగా ఉంటేనే  పదవులు వచ్చాయా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ లో సానుభూతితోనే  గెలిచారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్లను ఊసరవెళ్లి అంటున్న ఈటల ..గులాబీ పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరిన ఈటలను ఏమనాలని ప్రశ్నించారు.