- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి
వీణవంక, వెలుగు: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సోమవారం వీణవంకలో మీడియాతో మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు హత్యారాజకీయాలను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు.
బెదిరింపు మాటలు మాట్లాడిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్, లీడర్లు గంగాడి తిరుపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి సర్పంచ్ అభ్యర్థి సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
