హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో ఇప్పటి వరకు ( అక్టోబర్ 24 ఉదయం 8గంటల వరకు) 25 మంది మృతి చెందారని సమాచారం అందుతోంది.. 11 మృతదేహాలు బయటకు తీయగా.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD 01 N 9490).. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ వద్ద మంటలు చెలరేగి ఈ ఘోరం సంభవించినట్లు ఎస్పీ ప్రాథమికంగా నిర్ధారించారు. ఈప్రమాదంలో ఇప్పటి వరకు ( అక్టోబర్ 24 ఉదయం 8 గంటల వరకు) 25 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
►ALSO READ | వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం: మృతులంతా హైదరాబాద్ వాసులే..
ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ప్రమాద సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి కొంతమంది బయటపడ్డారు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను ( అక్టోబర్ 24 ఉదయం 8గంటల వరకు) వెలికి తీశారు. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని వివరాలు తెలియాల్సి ఉంది.
